కార్మిక చట్టాల అమలు తాత్కాలికంగా వాయిదా!

by  |
కార్మిక చట్టాల అమలు తాత్కాలికంగా వాయిదా!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం కొత్తగా తెచ్చిన నాలుగు కొత్త కార్మిక చట్టాల అమలును తాత్కాలికంగా వాయిదా పడింది. కొన్ని రాష్ట్రాలు కొత్త కర్మిక చట్టాల విధి విధానాలను ఖరారు చేయకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు కార్మిక శాఖ స్పష్టం చేసింది. దీంతో గతంలో నిర్ణయించినట్టుగా ఏప్రిల్ 1న వేతన విధానంలో జరగాల్సిన మార్పు కూడా ఉండదు. అలాగే, కంపెనీల పీఎఫ్(ప్రావిడెంట్ ఫండ్) అంశంలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. కొత్త నాలుగు కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే గనక ఉద్యోగుల బేసిక్ వేతనం, పీఎఫ్ విధానంలో గణనీయమ మార్పులు వచ్చేవి. దీనికి కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిబంధనలకు నోటిఫై చేయాలి.

అయితే, పలు రాష్ట్రాలు నిబంధనలను రూపొందించాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ విషయంలో నిబంధనలను ఇంకా ఖరారు చేయలేదు. అందుకే ఈ కొత్త కార్మిక చట్టాలను వాయిదా వేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కంపెనీలు బేసిక్ శాలరీని తక్కువగా చూపించి అలవెన్సులను ఎక్కువగా కల్పించేవి. కొత్త చట్టం అమల్లోకి వస్తే..ఉద్యోగి బేసిక్ జీతం 50 శాతం, అలవెన్సు 50 శాతంగా ఉండాలి. ఇప్పుడు ఈ చట్టం అమలు వాయిదా పడటంతో పాత విధానంలోనే వేతనాలను ఉద్యోగులు తీసుకోనున్నారు.



Next Story

Most Viewed