హుజురాబాద్‌లో రంగంలోకి కేంద్ర బలగాలు

by  |
హుజురాబాద్‌లో రంగంలోకి కేంద్ర బలగాలు
X

దిశ, హుజూరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు చేపడుతున్నట్లు లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సిఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ కు చెందిన బలగాలతో కవాత్తు నిర్వహించారు. పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా, జమ్మికుంట రోడ్, మధువని గార్డెన్ వరకు కవాత్తు చేపట్టారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 3 వేల మంది సివిల్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని, మరో 5 వందల మంది సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహరించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కవాత్తులో హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి, ఏసీపీ నాగేందర్ గౌడ్, సీఐలు శ్రీనివాస్, కిరణ్, ఎస్ఐలు కిరణ్, శేఖర్ రెడ్డి, సీనానాయక్, బండ ప్రశాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.


Next Story