భారతదేశ గవర్నర్‌ జనరల్స్‌ అండ్ వైశ్రాయ్స్ (జనరల్ స్టడీస్.. ఇండియన్ హిస్టరీ స్పెషల్)

by Disha Web Desk 13 |
భారతదేశ గవర్నర్‌ జనరల్స్‌ అండ్ వైశ్రాయ్స్ (జనరల్ స్టడీస్.. ఇండియన్ హిస్టరీ స్పెషల్)
X

లార్ట్‌కానింగ్‌ (1858-62):

1861 కౌన్సిల్‌ చట్టం చేశారు.

పోర్ట్‌ఫోలియో వ్యవస్థ ఏర్పాటు చేశారు.

బడ్జెట్‌ విధానం ప్రవేశపెట్టాడు

ఆదాయ పన్నును ప్రవేశపెట్ట బడింది.

శ్వేత విప్లవం: భారత్‌లోని బ్రిటీష్‌ సైన్యం బ్రిటీష్‌ ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు. దీనిని వైట్‌ మ్యూటినీగా పిలుస్తారు.

1861లో తులసిరాం శివదయాల్‌ సాహెబ్‌ ఆగ్రా వద్ద రాధాస్వామి సత్సంగ్‌ను స్థాపించాడు.

1862లో హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి (కానీ ఇవి 1865లో సర్‌ జాన్‌ లారెన్స్‌ కాలంలో అమలులోకి వచ్చాయి)

ఒకటవ ఎల్జిన్(1862-68):

వహాబిలచే వేధించబడ్డాడు

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో మరణించాడు

రాబర్ట్‌ నేపియర్‌ (1868):

ఇతను తాత్కాలిక గవర్నర్‌గా పనిచేశాడు

డానిసన్‌ (1863-64):

ఇతను కూడా తాత్కాలిక గవర్నర్‌గా పనిచేశాడు

ఇతను వహాబీలను అణచివేసాడు

సర్‌జాన్‌ లారెన్స్‌ (1864-69):

స్కాలర్‌షిప్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడు

లార్డ్‌ మేయో (1869-72):

1869లో మేయో ఆదేశాల మేరకు W.W. హంటర్‌ "Imperial Gazette of India" ను రచించాడు.

"Linguistic Survey of India" ను డా. గిరిసన్‌ (Girysn) రచించాడు

మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించబడ్డాయి (ఇవి శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు).

1870లో ఎర్రసముద్రం కేబుల్‌ లింకు లండన్‌-బాంబేల మధ్య నిర్మించబడింది

కథియావర్‌లో రాజ్‌కోట్‌ కాలేజి, అజ్మీర్‌లో మేయో కాలేజీని ఏర్పాటు చేశాడు.

వ్యవసాయం, వాణిజ్య శాఖను ఏర్పాటు చేశాడు

అర్ధిక వికేంద్రీకరణను ప్రవేశపెట్టారు (ఆ తర్వాత కాలంలో ఇది స్థానిక స్వపరిపాలనకు దారితీసింది)

1872లో అండమాన్‌ జైలులో ఒక ఆఫ్ఘనిస్థాన్ పఠాన్‌ అయిన షేర్‌ అలీ ఆప్రిదీ లార్డ్‌ మేయోను హత్య చేసాడు.

గతంలో షేర్‌ అలీ రైనల్‌ టేలర్‌ అనే సైనిక అధికారి వద్ద సహాయకుడిగా పనిచేసి ఒక హత్య కేసులో అండమాన్‌ జైల్లో శిక్ష అనుభవిస్తుండేవాడు.

ఇతను 1883 మార్చి 11న వైపర్‌ దీవిలో ఉరితీయబడ్డాడు.

నార్త్‌బ్రూక్‌ (1872-76):

ఆదాయ పన్నును రద్దు చేశాడు (లార్డ్‌కానింగ్‌చే ప్రవేశపెట్టబడింది)

1872లో బాల్య వివాహం నిషేధ చట్టము/బ్రహ్మ చట్టంను ప్రవేశపెట్టాడు

లిట్టన్(1876-80):

1877లో ఢిల్లీ దర్బార్‌లో బ్రిటీష్‌ రాణి విక్టోరియా భారతదేశ చక్రవర్తిని అని ప్రకటించాడు.

సివిల్‌ సర్వీసెన్‌ గరిష్ట వయోపరిమితిని 21 సం. ల నుండి 19 సం॥లకు తగ్గించాడు.

ప్రాంతీయ భాషాపత్రికా చట్టమును 1878లో తీసుకువచ్చాడు.

చట్టపరమైన (Statutory) సివిల్‌ సర్వీసెస్‌ను ఏర్పాటు చేశాడు

సంస్థాన రాజులు పంపిన వ్యక్తులను బ్రిటీష్‌ ప్రభుత్వం అధికారులుగా గుర్తిస్తుంది

లార్డ్‌ రిప్పన్(1880-84):

ఇతన్ని రైతుల స్నేహితుడిగా పిలుస్తారు.

సివిల్‌ సర్వీసెస్‌ గరిష్ట పరిమితిని 19 సం||ల నుంది 21సం॥|లకు పెంచాడు.

ప్రాంతీయ భాషా పత్రికా చట్టాన్ని రద్దు చేశాడు.

1881లో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో దశాబ్ద జనాభా లెక్కలను చేపట్టాడు. అప్పటి జనాభా 254 మిలియన్లు

1881 ఫ్యాక్టరీ చట్టం: దీని ప్రకారం పని గంటలు తగ్గిచబడ్డాయి. (భారతదేశంలో మొదటి ఫ్యాక్టరీ చట్టం)

6 ఫ్యాక్టరీ చట్టాలు:

I - 1881

II - 1891

III - 1911

IV - 1922

V - 1934

VI - 1946

1882 -స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టాడు.

విద్యాభివృద్ధికి హంటర్‌ కమిటీని నియమించాడు.

1883 (ఇల్బర్ట్‌ బిల్లు వివాదం):

ఈ బిల్లు ప్రకారం భారతీయ న్యాయమూర్తులు బ్రిటీష/యూరోపియన్లను విచారించే అధికారం కలిగి ఉంటారు. కానీ తర్వాత ఇది విరమించబడింది.

ఇతను సెలవుపై ఆర్‌.సి. దత్‌ మిట్టర్‌ను కలకత్తా హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించాడు.

1883లో కరువు నియమావళి (కరువును ఎదుర్కొనే విధానం) ప్రవేశపెట్టాడు.

1882 - మైసూరు ఒడయార్‌ కుటుంబానికి మైసూరును తిరిగి అప్పగించాడు(Rendition of Mysore)

1832లో కుదించబడిన మైసూర్‌ను విలియం బెంటిక్‌ తీసుకొన్నాడు. 50 సం॥|లకు రిప్పన్‌ తిరగి మైసూరును 1882లో అప్పగించాడు.

డప్రిన్(1881-88):

1885 డిసెంబర్‌లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు

3వ ఆంగ్లో -బర్మా యుద్ధం(1885-86) ఎగువ బర్మాను ఆక్రమించాడు.

1887ల విక్టోరియా రాణి స్వర్ణోత్సవాలు జరిగాయి

లాండ్స్‌ డౌన్‌(1888-94):

భారత్‌ ఆఫ్ఘనిస్థాన్‌ ను వేరు చేస్తూ డ్యూరాండ్‌ అనే రేఖ గీయబడింది.

1891 - Age of Consent Act

సివిల్‌ సర్వీసెస్‌ను 3గా వర్గీకరించాడు

1) ఇంపీరియల్‌

2) ప్రావిన్షియల్‌

3) సబ్‌ ఆర్డినేట్‌

ఎల్జిన్-2(1894-99):

పశ్చిమ, మధ్య భారతదేశంలో ఒక తీవ్ర కరువు సంభవించింది.

జేమ్స్‌ ల్యాల్‌ కరువు కమిటీ ఏర్పడింది.

1897లో చీపాకర్ సోదరులు ర్యాండ్‌, ఐరెస్ట్‌లను హత్య చేశారు.



Next Story

Most Viewed