- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఐపీఎస్ లలో అత్యంత ధనవంతులు ఎవరో తెలుసా.. ఆయన ఆస్తి విలువ ఎంతంటే..
దిశ, ఫీచర్స్ : ఐపీఎస్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ దేశంలోని అత్యంత ధనవంతులైన ఐపీఎస్ అధికారుల్లో ఒకరు. అతను పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన మాజీ సీఎంలు కెప్టెన్ అమరీందర్ సింగ్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కంటే చాలా ధనవంతుడు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా.. మరెవరో కాదండి IPS గురుప్రీత్ సింగ్ భుల్లర్. గురుప్రీత్ సింగ్ భుల్లర్ 2004 బ్యాచ్ IPS అధికారి. అతను BA ఆనర్స్ డిగ్రీని పొందారు. ఈయన లూథియానా పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. అలాగే 2009 - 2013 మధ్య, 2015 నుంచి ఆగస్టు 2016 వరకు మొహాలి SSP గా విధులు నిర్వహించారు. అతని తాత గుర్డియాల్ సింగ్ భుల్లర్ కూడా IPS అధికారి. ఆయన ఐపీఎస్ అధికారి అయినప్పుడు పోస్టింగ్ జలంధర్‌లో వేశారు. గుర్దియల్ సింగ్ భుల్లర్ 1957, 1960 మధ్య జలంధర్ SSP గా ఉన్నారు.
ఆస్తి ఎంత?
ఐపీఎస్ గురుప్రీత్ సింగ్ భుల్లర్ 2016 లో రూ.152 కోట్ల ఆస్తులను ప్రకటించారు. తన ఆస్తుల డిక్లరేషన్‌లో ఎనిమిది ఇళ్లు, నాలుగు వ్యవసాయ, మూడు కమర్షియల్ ప్లాట్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. అతనికి ఢిల్లీలోని సైనిక్ ఫామ్‌లో రూ.85 లక్షల విలువైన వాణిజ్యపరమైన ఆస్తి, 1500 చదరపు గజాల ఖాళీ స్థలం కూడా ఉందని తెలిపారు.
మొహాలీలోని ఓ గ్రామంలో తనకు 45 కోట్ల రూపాయల విలువైన భూమి కూడా ఉందని చెప్పారు. మీడియా కథనాల ప్రకారం ఆయన చాలా వరకు పూర్వీకుల ఆస్తిని కలిగి ఉన్నాడు. అప్పట్లో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ సింగ్ ఆస్తులు రూ.48 కోట్లు కాగా, బాదల్ ఆస్తులు రూ.102 కోట్లు.
వారసత్వంగా వచ్చిన ఆస్తి..
ఆయన ఆస్తులు దాదాపు రూ. 45 కోట్లుగా అంచనా వేయవచ్చు. ఇది మొహాలీలోని ఒక గ్రామంలో సాగుకు పనికిరాని భూమి రూపంలో ఉంది. వారి స్థిరాస్తి రిటర్న్‌లలో (IPRs) వారు ఈ ఆస్తులలో చాలా వరకు వారసత్వంగా పొందారని పేర్కొన్నారు.