current affairs - September- 2022

by Dishanational4 |
current affairs - September- 2022
X

దిశ, ఎడ్యుకేషన్:

అరవింద్‌కు దుబాయ్ ఓపెన్ చెస్ టైటిల్

భారత గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం దుబాయ్ ఓపెన్ చెస్ టోర్నీ విజేతగా నిలిచాడు.

9 రౌండ్ల నుంచి 7.5 పాయింట్లతో అగ్రస్థానం సంపాదించాడు.

ఏడుగురు భారతీయులు టాప్ 10 లో నిలవడం విశేషం.

అర్జున్ ఎరిగేశి 6.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.

వృద్ధి రేటు అంచనా 7 శాతం : ఫిచ్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2022 - 23.. భారత వృద్ధి రేటు అంచనాలను 7 శాతానికి సవరిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఫిచ్ రేటింగ్స్ సంస్థ ప్రకటించింది.

ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగుతుండటం, వడ్డీ రేట్లు పెరగడంతో పాటు అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు దీనికి కారణంగా పేర్కొంది.

2022 - 23లో భారత వృద్ధి రేటు 7.8 నమోదకావచ్చని జూన్ లో అంచనా వేసింది. తాజాగా ఇప్పుడు దీనిని తగ్గించింది.

2023 - 24 అంచనాలను 7.4 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది.

ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా సెప్టెంబర్ 19న ప్రశ్నోత్తరాల అనంతరం ఉపసభాపతిగా వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద విహార నౌకగా ది గ్లోబల్ డ్రీమ్ 2:

ప్రపంచంలోనే అతిపెద్ద విహార క్రూజ్ నౌక పేరు .. ది గ్లోబల్ డ్రీమ్ 2.

ఇది 9 వేల మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు.

దీని నిర్మాణ బడ్జెట్ రూ. 11 వేల కోట్లు.

దీనిని ఎంవీ వెర్ఫ్ టన్ అనే జర్మన్..హాంకాంగ్ కంపెనీ దీనిని నర్మించింది.

దీని పొడవు 342 మీటర్లు కాగా బరువు 2.08 లక్షల టన్నులు.

పరిమాణం పరంగా ప్రపంచంలో 6వ అతి పెద్ద నౌక ది గ్లోబల్ డ్రీమ్ 2

దీని నిర్మాణ వ్యయం కారణంగా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో విడిభాగాలుగా చేసి విక్రయిస్తున్నారు.

ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీకి చిహ్నంగా కోణార్క్ ఆలయ రథ చక్రం:

భారత్‌లో అక్టోబర్ లో జరగనున్న 90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీకి చిహ్నంగా కోణార్క్ ఆలయ రథ చక్రాన్ని ఎంపిక చేశారు.

చక్రానికి చుట్టూ భారత జాతీయ పతాకంలోని మూడు రంగులను వృత్తంలా ఏర్పాటు చేసి రూపొందించిన లోగోను సీబీఐ ఆవిష్కరించింది.

కోణార్క్ ఆలయంలో తొలచిన సూర్యుడి రథానికి 24 చక్రాలు ఉంటాయి.

ఒక్కో చక్రంలో 16 ఆకులు ఉంటాయి.

ఏడు రోజులు 24 గంటలూ ఇంటర్ పోల్ విధుల నిర్వహణకు చిహ్నంగా ఈ లోగోను ఎంపిక చేశారు.

195 దేశాల నుంచి అధికారులు ఈ సమావేశాలకు హాజరవుతారు.

ఒక్కో ఏడాది ఒక్కో దేశంలో ఈ అసెంబ్లీని నిర్వహిస్తున్నారు.

1997లో భారతదేశంలో ఈ అసెంబ్లీ జరిగింది.

దేశం స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఏడాది ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీని నిర్వహించనున్నారు.

అక్టోబర్ 18 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి.

ముగిసిన జిమెక్స్ - 2022 విన్యాసాలు:

విశాఖపట్నం తీరంలో నిర్వహించిన భారత్ జపాన్ దేశాల ఆరో విడత మారిటైం విన్యాసాలు - 2022 (జిమెక్స్) ముగిసినట్లు నేవీ వర్గాలు వెల్లడించాయి.

ముగింపు వేడుకల్లో భారత నేవీ బృందానికి రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా సారథ్యం వహించారు.

జపాన్ తరపున రియర్ అడ్మిరల్ హిరాత్ టొషియుకి కమాండర్ గా కొనసాగారు.

దక్షిణ మధ్య రైల్వేకు గ్రీన్ కో రేటింగ్ పత్రాలు:

హైదరాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు మరో నాలుగు సంస్థలకు గ్రీన్ కో రేటింగ్ పత్రాలు లభించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

హైదరాబాద్ రైల్వే స్టేషన్ గ్రీన్ కో ప్లాటినం రేటింగ్, తిరుపతి క్యారేజ్ రిపేర్ షాప్ గ్రీన్ కో గోల్డ్, మౌలాలి డీజిల్ లోకోషెడ్ గ్రీన్ కో గోల్డ్, కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్ గ్రీన్ కో సిల్వర్ రేటింగ్ సాధించినట్లు తెలిపింది.

రైల్వే సంస్థలను, స్టేషన్ ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దినందుకు ఈ గుర్తిపు లభించింది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఈ పత్రాలను అందించింది.

7వ జాతీయ డిజిటల్ పరివర్తన సదస్సు:

హైదరాబాద్ లో తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలో 7వ జాతీయ పరివర్తన సదస్సు జరిగింది.

ఒడిశా మంత్రి తుషార కాంతి బెహరా, తెలంగాణ నవీన సాంకేతిక విభాగం సంచాలకురాలు రమాదేవి, హెచ్ పీఈ సంస్థ కంట్రీ మేనేజర్ మయాంక్ చతుర్వేది, అమెజాన్ వెబ్ సర్వీస్ వాణిజ్య విభాగాధిపతి అజయ్ కౌల్ లు ఈ సదస్సుకు హాజరయ్యారు.

యూనియర్ బ్యాంక్.. డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు:

బ్యాంకింగ్ సేవలను పూర్తిగా డిజిటల్ లో అందించే లక్ష్యంతో ప్రారంభించిన సంభవ్ లో బాగంగా కిసాన్ క్రెడిట్ కార్డులను పూర్తిగా డిజిటలీకరణ చేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

దీంతో బ్యాంకు శాఖకు వెళ్లి భూమి యాజమాన్యం, ఇతర పత్రాలు రైతులు సమర్పించాల్సిన అవసరం ఉండదు.

మొబైల్ ద్వారానే దరఖాస్తులు చేసుకోవచ్చు.

పత్రాల పరిశీలన ఆన్ లైన్ లోనే జరుగుతుందని యూబీఐ ఎండీ..సీఈఓ ఎ. మణిమేఖలై తెలిపారు.

ఆర్ బీఐ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్ బీఐహెచ్) సహకారంతో, మధ్యప్రదేశ్ లోని హర్దా జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ ప్రారంభించింది. ఈ- కేవైసీ, ఈ- సైన్, ఏపీఐ ఉపయోగించి ఈ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed