కెనరా బ్యాంకు నికర లాభాలు 88 శాతం అప్

by  |
కెనరా బ్యాంకు నికర లాభాలు 88 శాతం అప్
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ 88.54 శాతం వృద్ధితో రూ. 749.73 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు రూ. 406.43 కోట్లను నమోదు చేసినట్టు బ్యాంకు తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 15,531.80 కోట్ల నుంచి రూ. 24,490.63 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

అదేవిధంగా డిసెంబర్ 31 నాటికి బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 7.48 శాతానికి పడిపోయాయని, 2019, డిసెంబర్ చివరి నాటికి ఇవి 8.40 శాతంగా నమోదయ్యాయని బ్యాంకు తెలిపింది. ఈ త్రైమాసికంలో బ్యాడ్ లోన్స్ కోసం రూ. 4,327.34 కోట్లను కేటాయించినట్టు బ్యాంకు వెల్లడించింది. కెనరా బ్యాంకు ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బుధవారం బ్యాంకు షేర్ ధర 0.22 శాతం తగ్గి రూ. 133.30 వద్ద ట్రేడయింది.



Next Story

Most Viewed