ఫెడ్ చైర్ 8 నిమిషాల ప్రసంగం తర్వాత.. $78 బిలియన్ల సంపదను కోల్పోయిన US సంపన్నులు

by Disha Web Desk 12 |
ఫెడ్ చైర్ 8 నిమిషాల ప్రసంగం తర్వాత.. $78 బిలియన్ల సంపదను కోల్పోయిన US సంపన్నులు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని అత్యంత సంపన్నులు ఫెడ్ చైర్ 8 నిమిషాల ప్రసంగం తర్వాత దాదాపు $78 బిలియన్ల సంపదను కోల్పోయారు. జాక్సన్ హోల్‌లో ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ చేసిన ప్రసంగం స్టాక్ మార్కెట్ పతనానికి దారితీసింది. దీంతో అమెరికాలోని అత్యంత ధనవంతుల సంపద శుక్రవారం నాడు ఘోరంగా ఆవిరైపోయింది. ఇందులో జెఫ్ బెజోస్ అత్యధికంగా నష్టపోయాడు. దీంతో అతని సంవద $6.8 బిలియన్లు తగ్గింది. అలాగే టేస్లా సీఈవో ఎలోన్ మస్క్ సంపద $5.5 బిలియన్లు క్షీణించింది. వీరితో పాటుగా అయితే బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వరుసగా $2.2 బిలియన్, $2.7 బిలియన్లను కోల్పోయారు.

Also Read : 'అణుబాంబుల‌తో మా విమానాలు రెడీ..' ర‌ష్యాకు మ‌ద్దతుగా రంగంలోకి బెలార‌స్

Next Story

Most Viewed