'అణుబాంబుల‌తో మా విమానాలు రెడీ..' ర‌ష్యాకు మ‌ద్దతుగా రంగంలోకి బెలార‌స్

by Disha Web Desk 20 |
అణుబాంబుల‌తో మా విమానాలు రెడీ.. ర‌ష్యాకు మ‌ద్దతుగా రంగంలోకి బెలార‌స్
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం ఇప్పుడ‌ప్పుడే స‌మ‌సిపోయేలా లేదు. ర‌ష్యా భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని ఉక్రెయిన్‌పై దాడికి దిగిన ర‌ష్యాకు వ్య‌తిరేకంగా అమెరికాతో పాటు నాటో దేశాలు పావులు క‌దిపాయి. ఇప్పుడు ఈ యుద్ధం కాస్తా అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల‌ను మ‌రింత పెంచుతున్నాయి. ఈ క్ర‌మంలోనే, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అణ్వాయుధాలను మోసుకుపోవ‌డానికి తమ సైన్యం SU-24 యుద్ధ విమానాలను రెడీ చేసింద‌ని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ దండయాత్రకు ముందు బెలారస్ త‌మ మిత్ర దేశపు రష్యన్ దళాలకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే, అప్ప‌టికి ఆ దేశం అణ్వాయుధాలను కలిగి లేదు. కాగా, పొరుగున ఉన్న పోలాండ్ నుండి సంభావ్య ముప్పు పొంచి ఉన్న‌ట్లు బెలార‌స్ ప్ర‌క‌టించింది. అదే విష‌యాన్ని ప్రస్తావిస్తూ, ఒక వైపు ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, మ‌రోవైపు NATOకు కూడా మిత్రుడైన‌ లుకాషెంకో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. "ప‌శ్చిమ దేశాలు ఉద్రిక్త‌త‌ల‌ను తీవ్రతరం చేయడానికి ప్ర‌య‌త్నిస్తే, హెలికాప్టర్లు, విమానాలు కూడా వారిని రక్షించవని అర్థం చేసుకోవాలి" అని పేర్కొన్నారు.

"బెలారస్‌తో శ‌త్రుత్వం పెంచడం మంచి ఆలోచన కాదు. ఎందుకంటే, మేము కూడా అణ్వాయుధాలను కలిగి ఉన్న యూనియన్ స్టేట్ (రష్యా, బెలారస్). అలా చేస్తే ప‌రిస్థితి మ‌రింత‌ తీవ్రతరం అవుతుంది. ప‌శ్చిమ దేశాలు సమస్యలను సృష్టించడం ప్రారంభిస్తే.. ప్రతిస్పందన వెంటనే ఉంటుంది, "అని ఆయ‌న వ్యాఖ్యానించారు. "మేము అర్థ‌ర‌హితంగా మాట్లాడుతున్నామ‌ని మీరు అనుకుంటున్నారా? అంతా సిద్ధంగా ఉంది!" అంటూ లుకాషెంకో చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో ఇప్పుడు లుకాషెంకో చేసిన హెచ్చరిక వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపుతున్నాయి.

Also Read : ఫెడ్ చైర్ 8 నిమిషాల ప్రసంగం తర్వాత.. $78 బిలియన్ల సంపదను కోల్పోయిన US సంపన్నులు

Next Story

Most Viewed