SBI, HDFC, ICICI తో పాటు పలు బ్యాంకుల UPI రోజువారీ లిమిట్ ఎంతో తెలుసా..!

by Disha Web Desk 17 |
SBI, HDFC, ICICI తో పాటు పలు బ్యాంకుల UPI రోజువారీ లిమిట్ ఎంతో తెలుసా..!
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలను తీసుకొచ్చింది. అప్పటి నుంచి మొదలు ప్రతి ఏడాది UPI చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల నివేదికల ప్రకారం, 2022లో UPI చెల్లింపులు రికార్డు స్థాయిలో రూ. 149.5 ట్రిలియన్లకు చేరుకున్నాయి. ఇదే దూకుడుతో 2030 నాటికి భారత డిజిటల్ చెల్లింపుల విలువ రూ. 82 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.

అయితే, తాజాగా UPI చెల్లింపుల పట్ల కొన్ని పరిమితులు విధించారు. ముఖ్యంగా భారత దిగ్గజ బ్యాంకులు అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC, ICICI వంటి పలు బ్యాంకులు UPI లావాదేవీలపై పరిమితులు విధించాయి.

NPCI నిబంధనల ప్రకారం, UPI ద్వారా ఒక వ్యక్తి రోజుకు గరిష్టంగా రూ. 1 లక్ష మాత్రమే చెల్లింపులు చేయగలరు.

* కెనరా బ్యాంక్ UPI పరిమితి రోజుకు రూ. 25,000గా ఉంది.

* SBI, HDFC బ్యాంకుల UPI పరిమితి రోజుకు రూ. 1 లక్ష వరకు ఉంది. HDFC బ్యాంక్ కొత్త వినియోగదారులు రూ. 5,000 వరకు మాత్రమే UPI లావాదేవీలు చేయగలరు.

* Axis బ్యాంకు వారికి రూ. 1 లక్ష వరకు చెల్లింపులు చేయవచ్చు.

* ICICI కస్టమర్‌లు రూ. 1 లక్ష వరకు UPI పరిమితి ఉంది.

* Bank of Baroda UPI లిమిట్ రూ. 25 వేలు.

నగదు ట్రాన్స్‌ఫర్ లిమిట్‌తో పాటు, NPCI లావాదేవీల సంఖ్యపై కూడా పరిమితిని విధించింది. ఒక వ్యక్తి రోజుకు 20 లావాదేవీలు మాత్రమే చేయడానికి అనుమతి ఉంది. ఈ లిమిట్ పూర్తయ్యాక, తిరిగి 24 గంటల వరకు వేచి ఉండాలి. వీటితో పాటు Google Pay, Paytm, Amazon Pay UPI తదితర అన్ని UPI యాప్‌లు బ్యాంక్ ఖాతాలో మొత్తం పది ట్రాన్సాక్షన్స్‌తో పాటు, రోజుకు రూ. 1 లక్ష పరిమితిని విధించాయి.

Also Read..

ఆధార్‌తో యూపీఐ యాక్టివేషన్ ఫీచర్ తెచ్చిన గూగుల్‌పే!


Next Story