రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి డబ్బులు.. ఇలా చెక్ చేసుకోండి

by Disha Web Desk 17 |
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి డబ్బులు.. ఇలా చెక్ చేసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రతి ఏడాది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6000 అను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని మూడు విడతలుగా రూ.2000 చొప్పున దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. ఇప్పటికే 14 విడత పూర్తి కాగా, 15 వ విడత సాయం కోసం రైతులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

15 వ విడత పెట్టుబడి సాయం రూ.2000 లను రేపు (బుధవారం) అర్హత కలిగిన 8 కోట్ల మంది పైగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. e-Kyc పూర్తి చేసిన వారికి ఈ అమౌంట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. జార్ఖండ్‌‌లోని ఖుంటిలో బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 15 వ విడతలో మొత్తం రూ.18,000 కోట్లను పంపిణీ చేయనున్నారు.

PM-KISAN క్రింద లబ్ధిదారుల జాబితాలో పేరు చెక్ చేసుకోడానికి https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి, బెనిఫిషియరీ లిస్ట్‌పై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, గ్రామం ఆప్షన్లను నమోదు చేసి గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. దానిలో మీ పేరు చెక్ చేసుకోవచ్చు.

Next Story