సెమీకండక్టర్ల తయారీలో స్టార్టప్‌ల ప్రోత్సాహానికి టీహబ్ ప్రత్యేక కార్యక్రమం!

by Disha Web Desk 7 |
సెమీకండక్టర్ల తయారీలో స్టార్టప్‌ల ప్రోత్సాహానికి టీహబ్ ప్రత్యేక కార్యక్రమం!
X

హైదరాబాద్: ప్రముఖ టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీహబ్ సెమీకండక్టర్ల తయారీ రంగంలో స్టార్టప్‌ల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రకటించింది. కొత్త ఆవిష్కరణలు, వ్యాపారులను ప్రోత్సహించడానికి ఏఐసీ-టీహబ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ద్వారా సెమీకండక్టర్ కోహొర్ట్‌ను ప్రారంభించింది. నిపుణుల నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో వర్క్స్‌షాప్‌లు, స్పెషలైజ్డ్ మెంటార్‌షిప్, మార్కెట్లో విస్తరణ, పెట్టుబడులు, పరిశ్రమలో సంబంధాలకు సంబంధించి ప్రోత్సాహం, సవాళ్లను అధిగమించేందుకు పాల్గొన్న వ్యవస్థాపకులకు సహకారం లభించనుంది.

భారత ఇంజనీర్లు అనేక సంవత్సరాలుగా గ్లోబల్ కంపెనీలతో కలిసి సెమీకండక్టర్ రంగానికి పెద్ద ఎత్తున సహకారం అందించారు. ప్రస్తుతం కీలకమైన ఈ రంగంలో స్టార్టప్‌లకు మద్దతిస్తూ డిజైన్ స్టార్టప్‌లను ఏర్పాటు చేయడంలో, అభివృద్ధిలో సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించామని టీహబ్ సీఈఓ ఎంఎస్ఆర్ తెలిపారు. టీహబ్, ఏఐసీ కలిసి ఈ కార్యక్రమం ద్వారా సెమీకండక్టర్ స్టార్టప్‌లకు సరైన మార్గదర్శకత్వం, పెట్టుబడుల అవకాశం, నెట్‌వర్కింగ్ అవకాశాలను అందించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆరు నెలల సుధీర్గమైన హైబ్రిడ్ కార్యక్రమంలో భవిష్యత్తు సెమీకండక్టర్ల సరఫరాను భర్తీ చేసే 20 స్టార్టప్ కంపెనీలకు సహకారం అందించనున్నట్టు ఎంఎస్ఆర్ వెల్లడించారు.

సీనియర్ సిటిజన్ల కోసం సరికొత్త స్టార్టప్.. ప్రారంభోత్సవంలో రతన్ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు


Next Story

Most Viewed