స్పైస్‌జెట్ ఛైర్మన్‌కు చురకలంటించిన సుప్రీంకోర్టు

by Dishanational1 |
స్పైస్‌జెట్ ఛైర్మన్‌కు చురకలంటించిన సుప్రీంకోర్టు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం చురకలంటించింది. ఇటీవల అయజ్ సింగ్ ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్ కంపెనీ గోఫస్ట్‌ని కొనేందుకు 'బిజీ బీ'తో కలిసి బిడ్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రెడిట్ సూయిస్‌కు చెల్లించాల్సిన బకాయిల గురించి సుప్రీంకోర్టు అజయ్ సింగ్‌ను ప్రశ్నించింది. 'గోఫస్ట్‌ను తీసుకోవాలని వచ్చిన వార్తలపై తాము ఎందుకు న్యాయపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు? మీ దగ్గర ఒక సంస్థను కొనగలిగే శక్తి ఉన్నప్పుడు, బకాయిలను తిరిగి చెల్లించలేరా? అని స్పైస్‌జెట్‌ను ప్రశ్నించింది. గోఫస్ట్ కోసం బిడ్డింగ్ వేసిన విషయాన్ని గమనించామని, క్రెడిట్ సూయిస్‌కు బకాయిలను క్లియర్ చేయాలని సూచించింది. ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు అని సుప్రీంకోర్టు కోరింది. బకాయి చెల్లింపులో జాప్యం చేయకుండా మార్చి 15లోగా క్రెడిట్ సూయిస్‌కు 1.25 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీ మార్చి మూడోవారంలో కోర్టుకు హాజరు కావాలని అజయ్ సింగ్‌కు స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబరులో విచారణ సందర్భంగా, క్రెడిట్‌ సూయిజ్‌కు స్పైస్‌జెట్‌ 1 మిలియన్‌ డాలర్లు బకాయిపడగా, మొదటి విడతలో 5 లక్షల డాలర్లు చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed