కొత్తగా మరో 10 విమానాలు అందుబాటులోకి తెచ్చిన స్పైస్‌జెట్

by Dishanational1 |
కొత్తగా మరో 10 విమానాలు అందుబాటులోకి తెచ్చిన స్పైస్‌జెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కొత్తగా 10 విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాబోయే వేసవికి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ విమానాలను లీజుకు తీసుకున్నట్టు కంపెనీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. విమానాల సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా వేసవి ట్రావెల్ సీజన్‌లో ప్రయాణీకులకు ఇబ్బందుల్లేని, మెరుగైన కనెక్టివిటీ, సేవలను అందించడానికి వీలవుతుందని పేర్కొంది. ఇటీవలే స్పైస్‌జెట్ హైదరాబాద్ నుంచి అయోధ్యకు కొత్త డైరెక్ట్ విమాన సేవలను ప్రారంభించింది. ఇది ఏప్రిల్ 2 నుంచి నిరంతరాయంగా సిద్ధంగా ఉంది. వారానికి మూడుసార్లు ఈ రూట్‌లో విమానాన్ని నడపనున్నట్టు స్పైస్‌జెట్ పేర్కొంది. అజయ్ సింగ్ నేతృత్వంలోని స్పైస్‌జెట్ మూడు కంపెనీలతో ఉన్న వివాదాలను పరిష్కరించడంతో స్పైస్‌జెట్ సుమారు రూ. 685 కోట్లను ఆదా చేసుకున్నట్టు తెలిపింది. ఈ సెటిల్‌మెంట్‌ల కారణంగా స్పైస్‌జెట్ అదనంగా మూడు ఎయిర్‌ఫ్రేమ్‌లు, ఇంజన్‌లను కొనుగోలు చేసింది. గతంలో ఉన్న వివాదాల పరిష్కార ప్రక్రియలను వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నామని, తద్వారా ఆదాయం, వృద్ధిలో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed