IDBI బ్యాంక్‌లో వాటాల ఉపసంహరణ కోసం అనేక బిడ్‌లు: DIPAM సెక్రటరీ

by Disha Web Desk 17 |
IDBI బ్యాంక్‌లో వాటాల ఉపసంహరణ కోసం అనేక బిడ్‌లు: DIPAM సెక్రటరీ
X

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కోసం ప్రభుత్వానికి అనేక బిడ్‌లు వచ్చాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(DIPAM) సెక్రటరీ తుహిన్ కాంతా పాండే శనివారం తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు కలిపి 94.71 శాతం వాటా ఉంది. దీనిలో 60.72 శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. 2019లో, ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్‌ఐసీ సంస్థ రూ. 21,624 కోట్లను బ్యాంకులో ఇన్వెస్ట్ చేసింది. LIC ప్రస్తుతం మేనేజ్‌మెంట్ కంట్రోల్‌తో IDBI బ్యాంక్ ప్రమోటర్‌గా ఉంది. ప్రభుత్వం సహ-ప్రమోటర్‌గా ఉంది.

ఇవి కూడా చదవండి : త్వరలో పూర్తికానున్న IDBI బ్యాంకు ప్రైవేటీకరణ!



Next Story

Most Viewed