భారీ నష్టాల్లో మార్కెట్లు.. ఎరుపెక్కిన సూచీలు

by Disha Web Desk 17 |
భారీ నష్టాల్లో మార్కెట్లు.. ఎరుపెక్కిన సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో పయనిస్తున్నాయి. మంగళవారం అమెరికా, ఐరోపా మార్కెట్లు నష్టాలతో ముగియడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా బుధవారం ఉదయం 700 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం నాటికి 1300 పాయింట్లకు పైగా పతనమై 71,822 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా నిఫ్టీ సైతం భారీగా 364 పాయింట్లు పడిపోయి 21,668 వద్ద కొనసాగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోని షేర్లకు అమ్మకాలు తలెత్తడంతో బ్యాంక్ నిఫ్టీ 1800 పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్‌లో దాదాపు అన్ని షేర్లు కూగా ఎరుపు రంగులోనే ఉన్నాయి. ప్రైవేట్ రంగ HDFC బ్యాంక్ అత్యధికంగా 120 పాయింట్లు పడిపోయింది. ఇదే బాటలో ICICI, AXIS బ్యాంక్ షేర్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఐటీ రంగంలోని షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి.


Next Story