ఈ ఏడాదిలోనే 75 వేల మంది మహిళా డెవలపర్లకు శిక్షణ

by Dishanational1 |
ఈ ఏడాదిలోనే 75 వేల మంది మహిళా డెవలపర్లకు శిక్షణ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఏడాది ఆఖరు కల్లా భారత్‌లో 75,000 మంది మహిళా డెవలపర్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నట్టు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న సత్య నాదెళ్ల, గురువారం బెంగళూరులో 'కోడ్ వితౌట్ బ్యారియర్స్' ప్రోగ్రామ్‌ను భారత్‌లోనూ విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా టెక్ స్కిల్స్‌ యాక్సెస్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా 'మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్ ' నిర్వహించిన డెవలపర్ల సమావేశంలో.. 'ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఇన్నోవేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు భారత డెవలపర్లు కీలకమన్నారు. ఈ ప్రోగ్రామ్ కింద ప్రస్తుత ఏడాది ముగిసేలోపు 75,000 మంది మహిళా డెవలపర్లకు స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం. ఈ నెల నుంచే దీన్ని ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమంతో మహిళా డెవలపర్లు, కోడింగ్ స్కిల్స్ ఉన్నవాళ్లు టెక్నికల్ విభాగాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని' సత్య నాదేళ్ల వివరించారు. ఈ కార్యక్రమాన్ని మొదట 2021లో తొమ్మిది ఆసియా-పసిఫిక్ దేశాల్లో ప్రారంభించామని, ఏఐ, క్లౌడ్, డిజిటల్ టెక్నాలజీల్లో సమానత్వాన్ని తగ్గించేందుకే దీన్ని తీసుకొచ్చినట్టు మైక్రోసాఫ్ట్ అధినేత చెప్పారు. ఇది మహిళా డెవలపర్‌లు, కోడర్‌లకు మద్దతు, శిక్షణ, నెట్‌వర్కింగ్ అవకాశాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.


Next Story