శ్రీలంక బిస్కెట్ బ్రాండ్‌తో రిలయన్స్ ఒప్పందం!

by Dishanational4 |
శ్రీలంక బిస్కెట్ బ్రాండ్‌తో రిలయన్స్ ఒప్పందం!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ బిస్కెట్ల రంగంలోకి ప్రవేశించింది. సంస్థ ఎఫ్ఎంసీజీ విభాగం, రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్‌వీఎల్) అనుబంధంగా ఉన్న రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, శ్రీలంక కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మలిబన్ బిస్కెట్ మాన్యుఫక్చర్‌తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మలిబన్న్‌కు చెందిన వివిధ రకాల బిస్కెట్లను రిలయన్స్ భారత్‌లో విక్రయించనుంది. దీంతో ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న బ్రిటానియా, పార్లె కంపెనీలతో రిలయన్స్ సంస్థ పోటీ పడనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

మలిబన్ సంస్థ శ్రీలంకలో 70 ఏళ్లుగా బిస్కెట్లు, కుకీలు, వేఫర్లు వంటి ఆహార పదార్థాలను తయారు చేస్తోంది. కంపెనీ తన ఉత్పత్తులను అంతర్జాతీయంగా మొత్తం ఐదు ఖండాలలో 35 దేశాలకు కూడా ఎగుమతి చేస్తోందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఇటీవల ఇండిపెండెన్స్ పేరుతో ఎఫ్ఎంసీజీ బ్రాండ్‌ను ప్రారంభించింది. భారత వినియోగదారుల కోసం దేశీయ, ప్రపంచ బ్రాండ్లను మెరుగైన నాణ్యతతో అందించడమే తమ లక్ష్యమని రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ పేర్కొంది.


Next Story

Most Viewed