Phone Pay, Google Pay వాడుతున్నారా.. RBI షాకింగ్ డెసిషన్

by Disha Web Desk 2 |
Phone Pay, Google Pay వాడుతున్నారా.. RBI షాకింగ్ డెసిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: మోబైల్ ఫోన్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. యూపీఐ బేస్డ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌పై కూడా ఛార్జీల విధింపునకు ఆర్బీఐ రంగం సిద్ధం చేస్తోంది. దీని ద్వారా నిర్వహణ ఖర్చులను తిరిగి పొందవచ్చని భావిస్తోంది. ఇలా యూపీఐ లావాదేవీలపై ఛార్జీని విధిస్తే ఎలా ఉంటుంది.. అనే కోణంలో ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోనుంది. ఈ సూచనల ప్రకారమే డిజిటల్ పేమెంట్ ఛార్జీలను విధించే విధి విధానాలపై మార్గ దర్శకాలను రూపొందించే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. యూపీఐ బేస్డ్‌గా ఉన్న క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో పాటు ఫోన్‌ పే, గూగుల్‌పేలపై ఈ ఫీజును విధించాలని భావిస్తోంది.

రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌కు కౌంటర్.. కార్తికేయ-2పై RGV ప్రశంసలు


Next Story