UPI లాగా మరో కొత్త పేమెంట్ సిస్టంను తీసుకురానున్న RBI

by Disha Web Desk 17 |
UPI లాగా మరో కొత్త పేమెంట్ సిస్టంను తీసుకురానున్న RBI
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్తగా ఒక పేమెంట్ సిస్టం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీని పేరు ‘లైట్ వెయిట్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టం(LPSS)’. ఇప్పటికే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫెస్ (UPI) ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చిన ఆర్‌బీఐ కొత్త సిస్టం ద్వారా మరొక కొత్త అధ్యాయానికి తెర లేపనుంది. LPSS సిస్టం అనేది మాములు UPI లాగా పేమెంట్స్ చేయకుండా ప్రకృతి విపత్తులు, దేశాల మధ్య యుద్ధాలు, భారీ వర్షాలు, వరదలు వంటి ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పేమెంట్స్ సిస్టమ్ ద్వారా చెల్లింపలు చేయనుంది. విపత్కర పరిస్థితుల్లో ఇది బాగా ఉపయోగపడుతుందని ఆర్‌బీఐ పేర్కొంది.

ప్రస్తుతం ట్రాన్సాక్షన్స్ కోసం NEFT, RTGS, UPI వంటి పలు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వీటికి ఇంటర్నెట్ తప్పనిసరి. విపత్తుల సమయాల్లో కమ్యూనికేషన్ పనిచేయనప్పుడు వీటి ద్వారా చెల్లింపులు చేయడం కుదరదు. కాబట్టి విపత్తులు ఎదురైనప్పుడు కూడా సులభంగా ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ వ్యవస్థను రూపొందించాలని ఆర్‌బీఐ చూస్తోంది. పరిమిత సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరికరాలతో ఈ కొత్త పేమెంట్ సిస్టంను ఆర్‌బీఐ తయారు చేయనుంది. విపత్కర సమయాల్లో అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు దీనిని యాక్టివేట్ చేసుకునేలా ఆర్‌బీఐ రూపొందించనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed