ఫ్రెషర్లకు మరో పరీక్ష పెట్టనున్న విప్రో!

by Disha Web Desk 17 |
ఫ్రెషర్లకు మరో పరీక్ష పెట్టనున్న విప్రో!
X

.బెంగళూరు: భారత ఐటీ సేవల దిగ్గజం విప్రో ఫ్రెషర్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆన్‌బోర్డింగ్ కోసం వేచి చూస్తున్న ఫ్రెషర్లకు ఇస్తామని చెప్పిన దానిలో సగం జీతానికే ఉద్యోగంలోకి తీసుకుంటామని ప్రకటించిన కంపెనీ, తాజాగా వారికి మరో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, కొత్తగా నిర్వహించే ట్రైనింగ్ లేదా పరీక్ష ద్వారా విప్రో మరింత మంది ఫ్రెషర్లను వదులుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

కంపెనీ 15 నెలలకు పైగా కంపెనీలో ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు ప్రాజెక్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్(పీఆర్‌పీ) ట్రైనింగ్ ఇవ్వనుంది. అందులో ఫ్రెషర్లు 60 శాతం మార్కులను సాధించకపోతే వారిని తక్షణమే తొలగించనుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే కొత్తగా ట్రైనింగ్ తీసుకోబోయే ఫ్రెషర్లు గతంలోనే శిక్షణను పూర్తి చేశారు. అయితే, దీనికి సంబంధించి విప్రో ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఈ అంశంపై స్పందించిన ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఐటీ ఎంప్లాయిస్ సెనెట్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్, విప్రో తీసుకుంటున్న నిర్ణయాలతో ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. ఫ్రెషర్స్ పట్ల కంపెనీ తన బాధ్యతలను తగ్గించుకునేందుకు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తోందని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Also Read..

ఉద్యోగులకు షాకివ్వబోతున్నఫేస్ బుక్ మాతృ సంస్థ?


Next Story

Most Viewed