జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ దివాలా ప్రక్రియపై స్టే విధించిన ఎన్‌సీఎల్ఏటీ!

by Disha Web Desk 17 |
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ దివాలా ప్రక్రియపై స్టే విధించిన ఎన్‌సీఎల్ఏటీ!
X

న్యూఢిల్లీ: మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎన్‌సీఎల్ఏటీ ఊరటనిచ్చింది. కంపెనీ దివాలా ప్రక్రియ చేపట్టాలని నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఉత్తర్వులపై శుక్రవారం జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రెబ్యునల్(ఎన్‌సీఎల్ఏటీ) స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి జీ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ, ఎండీ పునీత్ గోయెంకా కంపెనీకి వ్యతిరేకంగా ప్రొసీడింగ్స్‌ను సవాలు చేయడంపై ఉత్తర్వులు ఇచ్చింది.

జీ గ్రూపునకు చెందిన సిటీ నెట్‌వర్క్స్ రూ. 89 కోట్ల వరకు ఎగవేసిందని ఇండస్ఇండ్ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ఈ బకాయికి జీ ఎంటర్‌టైన్‌మెంట్ హామీ ఇచ్చిందని, కాబట్టి దివాలా పరిష్కార ప్రక్రియను మొదలుపెట్టాలని బ్యాంకు కోరింది. దీనికి అంగీకరించిన ఎన్‌సీఎల్‌టీ పరిష్కారం కోసం సంజీవ్ కుమార్ జలాన్‌ను నియమించగా, సిటీ నెట్‌వర్క్స్‌పై కూడా దివాలా ప్రక్రియ చేపట్టాలని బ్యాంకు మరో పిటిషన్ కూడా వేసింది.

ఈ క్రమంలో పునీత్ గోయెంకా పిటిషన్ వేయడంతో ఈ ప్రక్రియపై అప్పిలేట్ ట్రెబ్యునల్ స్టే ఇచ్చింది. దీనిపై సమాధానమివ్వాలని నోటీసులు ఇచ్చింది. అనంతరం విచారణను మార్చి 29కి వాయిదా వేసింది.

Next Story

Most Viewed