ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రా కోసం ఎంఅండ్ఎం, అదానీ టోటల్ ఎనర్జీస్ భాగస్వామ్యం

by Dishanational1 |
ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రా కోసం ఎంఅండ్ఎం, అదానీ టోటల్ ఎనర్జీస్ భాగస్వామ్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల గిరాకీకి అనుగుణంగా మౌలిక సదుపాయాల ఏర్పాటును కంపెనీలు వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నెలకొల్పేందుకు అదానీ టోటల్ గ్యాస్ అనుబంధ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మహీందా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) గురువారం ప్రకటనలో వెల్లడించింది. ఈ వ్యవహారంలో అదానీ టోటల్ ఎనర్జీస్ ఈ-మొబిలిటీ లిమిటెడ్(ఏటీఈఎల్) భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా వినియోగదారులకు ఇబ్బందుల్లేని ఛార్జింగ్ నెట్‌వర్క్ సౌకర్యాలు అందించేందుకు ఛార్జింగ్ పాయింట్ల డిస్కవరీ, అవైలబిలిటీ, నావిగేషన్, లావాదేవీల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. ఈ భాగస్వామ్యంతో ఎంఅండ్ఎం ఈవీ మోడల్ ఎక్స్‌యూవీ400 కస్టమర్లు ఇప్పుడు 1,100 కంటే ఎక్కువ ఛార్జర్ పాయింట్లను కలిగి ఉంటారు. ప్రధానంగా ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రా మెరుగుపడుతుంది. వినియోగదారులకు ఛార్జింగ్ సమస్యలు తీరనున్నాయని ఎంఅండ్ఎం ఆటోమోటివ్ డివిజన్ హెడ్ విజయ్ నక్రా పేర్కొన్నారు.


Next Story