ఆన్‌లైన్ గేమర్స్‌కు పిడుగులాంటి.. 28 శాతం జీఎస్టీకి సిఫార్సులు!

by Disha Web Desk 17 |
ఆన్‌లైన్ గేమర్స్‌కు పిడుగులాంటి.. 28 శాతం జీఎస్టీకి సిఫార్సులు!
X

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించే అంశంపై ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీ సిఫార్సు చేయనుంది. ఎలాంటి ఆన్‌లైన్ గేమ్ అయినా సరే గరిష్ఠ జీఎస్టీ అమలు చేయాలని ప్రతిపాదించనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశం దాదాపు ఖరారు చేశారని, తర్వలో జీఎస్టీ మండలికి అందించనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఆన్‌లైన్ గేమర్లు చెల్లించే ప్రారంభ ఫీజుతో పాటు పూర్తి విలువపై జీఎస్టీ ఉంటోంది. జీఎస్టీని 28 శాతానికి పెంచే విషయంలో జూన్‌లోనే సిఫార్సులు వచ్చినప్పటికీ, దీనిపై పునఃసమీక్షించాలని జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందానికి సూచనలు చేసింది.

తాజా నివేదికలో మంత్రుల బృందం ఆన్‌లైన్ గేమింగ్‌ను గేమ్స్ ఆఫ్ ఛాన్స్, గేమ్స్ ఆఫ్ స్కిల్‌గా రెండు విభాగాల్లో వర్గీకరించింది. ఈ రెండింటిపైనా గరిష్ట 28శాతం జీఎస్టీ విధించాలని పేర్కొంది. కాగా, రెండేళ్ల నుంచి దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ వృద్ధి గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు రూ. 13 వేల కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ మరో 2-3 ఏళ్లలో రూ. 29 వేల కోట్లకు చేరుకోనున్నట్టు పలు నివేదికలు అంచనా వేశాయి.

Next Story

Most Viewed