బలెనో, ఎక్స్ఎల్6 మోడళ్ల సీఎన్‌జీ వేరియంట్లను తెచ్చిన మారుతీ సుజుకి!

by Disha Web Desk 17 |
బలెనో, ఎక్స్ఎల్6 మోడళ్ల సీఎన్‌జీ వేరియంట్లను తెచ్చిన మారుతీ సుజుకి!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి సీఎన్‌జీ వేరియంట్లలో మరిన్ని మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ రెండు బ్రాండ్ల కార్లను సీఎన్‌జీ వేరియంట్ల ధరలు రూ. 8.28 లక్షల నుంచి రూ. 12.24 లక్షల మధ్య లభిస్తాయని కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.

గతేడాది 2.3 లక్షల సీఎన్‌జీ కార్లను విక్రయించామని, ఈ ఏడాది దీన్ని 4 లక్షలకు పెంచాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. 2010లో తొలిసారిగా మారుతీ సుజుకి సీఎన్‌జీ వేరియంట్లలో ఈకో, ఆల్టో, వ్యాగన్ఆర్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు మొత్తం 11.4 లక్షల సీఎన్‌జీ కార్లను విక్రయించింది.

బలెనో, ఎక్స్ఎల్6 సీఎన్‌జీ వెరియంట్ల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని, నవంబర్ మొదటి వారం నుంచి అమ్మకాలు మొదలవుతాయని శశాంక్ పేర్కొన్నారు. దేశీయ వాహన మార్కెట్లో సీఎన్‌జీ వాహనాలకు గణనీయమైన డిమాండ్ ఉంది. గతేడాది సగటున రోజుకు 1,300-1,400 బుకింగ్‌లు నమోదవగా,ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది 1,400-1,500 బుకింగ్‌లకు పెరిగాయని కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed