మహిళలకు అదిరిపోయే న్యూస్.. వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణం!

by Disha Web Desk 8 |
మహిళలకు అదిరిపోయే న్యూస్.. వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణం!
X

దిశ, ఫీచర్స్ : మహిళలకు ఆర్థిక చేయూతనందిస్తూ, వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్థితి మెరుగు పరచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన పథకం లక్షపతి దీదీ యోజన పథకం. దీనిని రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం 23 డిసెంబర్ 2023లో ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం మహిళలకు ఉపాధి శిక్షణ ఇచ్చి, తమ కాళ్లపై తాము నిలబడే విధంగా, ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సాయం అందజేస్తారు.అలాగే వారు సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఆదుకోవడం, వారికి వడ్డీ లేకుండా రూ. 5 లక్షల రుణాన్ని అందించడం. అలా చేయడం ద్వారా, ఆర్థికపరమైన సమస్యల నుంచి విముక్తి పొంది, వారు వ్యాపారాలను ప్రారంభించేందుకు, అభివృద్ధి చేసుకోవడానికి ఈ పథకం సపోర్టు ఇస్తుంది. భారతదేశంలోని గ్రామాలలో మూడు కోట్ల లక్షపతి దీదీలను సృష్టించాలని, పేద మహిళలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అర్హులైన మహిళలకు రుణాలు అందించడం, రుణాలు పంపిణీ చేసేందుకు నెలవారీ శిబిరాలు నిర్వహించడం, ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఇక మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతల్లో నివసించే మహిళలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి నెలకు కొంత ఆదాయం పొదుపు చేస్తారు, వాటితో ఒకరికి ఒకరు రుణాలను ఇచ్చుకుంటారు. వీరినే స్వయం సహాయక బృందాలు అంటారు. అయితే ఈ పథకం స్వయం సహాయక బృందంలో ఉన్న మహిళలకు మాత్రమే వడ్డీ లేకుండా రుణ సదుపాయం అందించనుంది.రుణ పరిమితి రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అందిస్తోంది.ఇక ఈ పథకం కింద సుమారు 2 కోట్ల నుంచి 3 కోట్ల పేద ప్రజలకు లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం.


Next Story