26 శాతం పెరిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం

by Disha Web Desk 17 |
26 శాతం పెరిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం
X

ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా, మార్చి త్రైమాసికంలో స్టాండ్‌లోన్ నికర లాభం 26 శాతం పెరిగి రూ.3,496 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే కాలంలో నికర లాభం రూ.2,767 కోట్లుగా ఉంది. ఇదే త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ. 4,521 కోట్ల నుండి 35 శాతం పెరిగి రూ. 6,103 కోట్లను నమోదు చేసింది. కేటాయింపులు కూడా తగ్గాయి, ఇవి గత త్రైమాసికంలో రూ.148.7 కోట్ల నుంచి రూ.147.6 కోట్లకు చేరుకున్నాయి. స్థూల నిరర్థక ఆస్తులు 1.78%కి తగ్గాయి. మార్చి త్రైమాసికంలో బ్యాంక్ కొత్తగా 2.2 మిలియన్ల కస్టమర్లను చేర్చుకుంది. మార్చి 31, 2023 నాటికి మొత్తం వినియోగదారుల సంఖ్య 41.2 మిలియన్లకు చేరుకుంది.


Next Story