Kotak Mahindra Bank : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్!

by Disha Web Desk 17 |
Kotak Mahindra Bank : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంకు ఈ నెలలో ఎఫ్‌డీ రేట్లను సవరించడం ఇది రెండోసారి. వారం రోజుల క్రితం కోటక్ బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంపిక చేసిన కాలవ్యవధులపై 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. అందులో ఏడాదికి పైన కాలవ్యవధి ఉండే డిపాజిట్లపై వర్తించనుంది.

బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 17(శుక్రవారం) నుంచి అమలు కానున్నాయి. సవరించిన వాటిలో 365-389 రోజుల కాలవ్యాధిపై 6.90 శాతం నుంచి 7 శాతానికి, 390 రోజుల(ఏడాదిపై 25 రోజులు) నుంచి 2 ఏళ్ల మధ్య కాలవ్యవధులపై వడ్డీని 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. మిగిలిన అన్ని కాలవ్యవధులపై ఫిబ్రవర్ 10న సవరించిన వడ్డీ రేట్లు కొనసాగనున్నాయి.

సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారుల కంటే అదనంగా మరో 0.50 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. పెద్దలకు వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధులపై వడ్డీ రేట్లు 3.25-6.25 శాతం మధ్య ఉంది. అత్యధికంగా 390 రోజుల నుంచి 2 ఏళ్ల మధ్య డిపాజిట్లపై 7.70 శాతం వడ్డీని బ్యాంకు ఇస్తోంది.



Next Story

Most Viewed