Jio AirFiber launch : వైర్లు లేకుండా ఇంటర్నెట్.. ఎయిర్‌ఫైబర్‌ను విడుదల చేసిన జియో!

by Disha Web Desk 17 |
Jio AirFiber launch : వైర్లు లేకుండా ఇంటర్నెట్.. ఎయిర్‌ఫైబర్‌ను విడుదల చేసిన జియో!
X

ముంబై: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మంగళవారం తన వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి జియో ఎయిర్‌ఫైబర్‌ను విడుదల చేసింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19న దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ గత నెల జరిగిన ఏజీఎంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో ఎయిర్‌ఫైబర్ 5జీ ఆధారిత వైర్‌లెస్ వైఫై సర్వీస్.

ఇది ఇళ్లు, ఆఫీస్‌లలో ఉపయోగించేలా పోర్ట్‌బుల్‌ వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ను 1.5 జీబీపీఎస్‌ వేగంతో పనిచేస్తుంది. దీని ద్వారా యూజర్లు ఎలాంటి అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న వైర్-ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌కు ప్రత్యామ్నాయంగా రిలయన్స్ జియో దీన్ని తీసుకొచ్చింది. జియో ఎయిర్‌ఫైబర్ ఎటువంటి కేబుళ్లు, వైర్లు లేకుండా పనిచేస్తుంది. ఈ డివైజ్ సమీపంలోని టవర్ నుంచి సిగ్నల్స్‌ను అందుకుని ఇంటర్నెట్‌ను ఇస్తుంది.

అంతేకాకుండా బ్రాడ్‌బ్యాడ్ కంటే ఎక్కువ స్పీడ్‌తో అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి జియో ఎయిర్‌ఫైబర్ సేవలను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణె నగాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో మిగిలిన నగరాల్లో అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ వివరించింది. జియో ఎయిర్‌ఫైబర్‌లో రూ. 599 నుంచి రూ. 3,999 మధ్య వివిధ రకాల ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.



Next Story

Most Viewed