కార్లకు 3 ఏళ్లు, బైక్‌లకు ఐదేళ్ల పాటు బీమా.. ప్రతిపాదించిన IRDAI !

by Disha Web Desk 17 |
కార్లకు 3 ఏళ్లు, బైక్‌లకు ఐదేళ్ల పాటు బీమా.. ప్రతిపాదించిన IRDAI !
X

న్యూఢిల్లీ: దేశీయ బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ వాహనాల ఇన్సూరెన్స్‌కు సంబంధించి కీలక ప్రతిపాదనలను చేసింది. 'థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్, ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ రెండింటినీ కవర్ చేసే లాంగ్-టర్మ్ మోటార్ ప్రొడక్ట్స్'పై డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. కార్లకు 3 ఏళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల పాటు బీమా ప్రతిపాదించింది.

థర్డ్ పార్టీ(ఇతరులకు జరిగే నష్టానికి), ఓన్ డ్యామేజ్‌లకు సంబంధించి దీర్ఘకాల మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రతిపాదనలతో కూడిన ముసాయిదాను ఐఆర్‌డీఏఐ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, అన్ని సాధారణ బీమా సంస్థలు మూడేళ్ల పాటు కార్లకు, ఐదేళ్ల కాలవ్యవధితో ద్విచక్ర వాహనాలకు ఇన్సూరెన్స్ ఆఫర్ చేయవచ్చు. ప్రీమియం మొత్తాన్ని వాహనం కొనే సమయంలో వసూలు చేస్తారు.

అదేవిధంగా ప్రస్తుత ఏడాది మోటార్ ఓన్ డ్యామేజ్ పాలసీలకు వర్తిస్తున్న నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలను దీర్ఘకాల బీమా పాలసీలకు కూడా ఇవ్వొచ్చని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసే సమయంలో నో క్లెయిమ్ బోనస్ అమలవుతుంది. వీటితో పాటు అగ్ని ప్రమాదాలకు కూడా దీర్ఘాకాలిక ఇన్సూరెన్స్ పాలసీని ఐఆర్‌డీఏఐ డ్రాఫ్ట్‌ను తీసుకొచ్చింది. ఇది నివాసాలకు 30 ఏళ్ల ఇన్సూరెన్స్ పాలసీని ప్రతిపాదించింది.

ఇవి కూడా చదవండి:

ఆన్‌లైన్ గేమింగ్‌ జీఎస్టీ పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్న పరిశ్రమలు


Next Story

Most Viewed