15 నిమిషాల్లో 6 లక్షల కోట్లు ఆవిరి

by Disha Web Desk 12 |
15 నిమిషాల్లో 6 లక్షల కోట్లు ఆవిరి
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య సోమవారం కీలక బెంచ్‌మార్క్ సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. S&P BSE సెన్సెక్స్ ఇంట్రా-డే ట్రేడ్‌లో దాదాపు 930 పాయింట్లు పడిపోయి 73,315.16 స్థాయిలకు చేరుకోగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 255 పాయింట్లు కోల్పోయి 22,263.55 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. ముగింపులో, S&P BSE సెన్సెక్స్ 845 పాయింట్లు(1.14 శాతం) పడిపోయి 73,400 స్థాయిల వద్ద ముగియగా, నిఫ్టీ 50 247 పాయింట్లు (1.1 శాతం) క్షీణించి 22,273 వద్ద ముగిసింది. దీంతో ప్రారంభంలో కేవలం 15 నిమిషాల వ్యవధిలో దాదాపు 6 లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. కాగా సాయంత్రం స్టాక్స్ ముగిసే సమయానికి కాస్త నష్టం తగ్గినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed