మీకు ATM కార్డు ఉందా..? అయితే రూ.5 లక్షల వరకు బీమా పొందొచ్చు!

by Disha Web Desk 17 |
మీకు ATM కార్డు ఉందా..? అయితే రూ.5 లక్షల వరకు బీమా పొందొచ్చు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఉంది. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడల్లో ఆ ఖాతాకు లింక్ అయిన ATM డెబిట్ కార్డ్‌ను కూడా అందిస్తారు. డబ్బును డ్రా చేయడానికి లేదా ఇతర షాపింగ్ అవసరాలకు మాత్రమే ఈ కార్డు ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ATM కార్డు ద్వారా ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. 'బీమా'. అవును మీరు విన్నది నిజమే. ATM కార్డు ద్వారా వినియోగదారులు దాదాపు రూ. 25 వేల నుండి రూ. 5 లక్షల వరకు బీమా పొందవచ్చు. ATM కార్డ్‌ని కనీసం 45 రోజుల పాటు ఉపయోగించేవారికి ఈ సదుపాయాన్ని పొందడానికి అర్హులు.


ఈ బీమా ప్రయోజనాలు ఒకేలా ఉండవు. ATM కార్డు రకాన్ని బట్టి అమౌంట్ మారుతుంది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ ఖాతాల రూపే కార్డు ఉన్నవారు సాధారణంగా రూ. 1 నుండి 2 లక్షల బీమా కవరేజీని పొందుతారు. ప్రమాదంలో మరణిస్తే, 5 లక్షల వరకు బీమా లభించే అవకాశం ఉంటుంది. ఇంకా, ప్లాటినం కార్డుపై రూ.2 లక్షలు, సాధారణ మాస్టర్ కార్డుపై రూ.50 వేలు, ప్లాటినమ్ మాస్టర్ కార్డుపై రూ.5 లక్షలు, వీసా కార్డుపై రూ.1.5 నుంచి 2 లక్షల వరకు, క్లాసిక్ కార్డుపై రూ. లక్ష వరకు బీమా లభిస్తుంది.


ముఖ్యంగా ATM కార్డును ఉపయోగించిన 45 రోజుల్లోపు కార్డుదారు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బీమా మొత్తాన్ని అందిస్తారు. ఈ బీమా ప్రయోజనం ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రైవేటు రంగ బ్యాంకులలో చూడవచ్చు. ATM కార్డుదారు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే, వారి నామినీ ఆ కార్డుదారు ఖాతా కలిగిన బ్యాంకుకు వెళ్లి అవసరమైన పత్రాలతో బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.






Next Story

Most Viewed