ఈ ఏడాది 12 శాతం వృద్ధి చెందనున్న ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్!

by Disha Web Desk 17 |
ఈ ఏడాది 12 శాతం వృద్ధి చెందనున్న ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్!
X

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా కంపెనీలు తమ ఉద్యోగులను హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పని చేయించుకుంటున్న నేపథ్యంలో దేశీయ ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్ వెల్లడించింది. కంపెనీలు ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా 2019లో కరోనాకు ముందు 5-8 శాతం ఉన్న ఈ విభాగం వాటా ఈ ఏడాది చివరి నాటికి 10-12 శాతానికి చేరుకుంటుందని కొలియర్స్ నివేదిక అంచనా వేసింది.

ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కంపెనీల ఆఫీస్ స్పేస్ వినియోగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని కొలియర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శామ్ హార్వె-జోన్స్ అన్నారు. ఆఫీస్ స్పేస్ రంగంలో సవాళ్లు ఉన్నప్పటికీ ఫ్లెక్సిబుల్ స్పేస్ విభాగం మద్దతు కొంత సానుకూలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫ్లెక్సిబుల్‌ స్పేస్ వినియోగంలో గణనీయమైన వాటాను ఐటీ కంపెనీలు సొంతం చేసుకోగా, ఆ తర్వాత బిజినెస్ సర్వీసులు, ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్, రిటైల్ రంగాలున్నాయి. ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ నిర్వహణదారులు స్వల్పకాలానికి జరిగే ఒప్పందాలు, సౌకర్యవంతంగా ఉండే నిబంధనలతో సేవలు అందిస్తున్నాయి. ఈ కారణంగానే క్లయింట్లకు ఖర్చులు తగ్గుతున్నాయని కొలియర్స్ పేర్కొంది.

Next Story

Most Viewed