అక్టోబర్‌లో పుంజుకున్న తయారీ కార్యకలాపాలు!

by Disha Web Desk 17 |
అక్టోబర్‌లో పుంజుకున్న తయారీ కార్యకలాపాలు!
X

న్యూఢిల్లీ: డిమాండ్, ఔట్‌పుట్ మెరుగ్గా ఉండటంతో ఈ ఏడాది అక్టోబర్‌లో భారత తయారీ రంగ కార్యకలాపాలు మరింత పుంజుకున్నాయి. ఇతర ఆర్థిక వ్యవస్థల మాదిరి కాకుండా ఈ ఏడాది ప్రారంభం నుంచి అధిక ద్రవ్యోల్బణం, భారత కరెన్సీ బలహీన పడినప్పటికీ దేశ తయారీ రంగం స్థిరంగా ఉంది.

ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) సూచీ అక్టోబర్‌లో 55.3 పాయింట్లకు పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 55.1 పాయింట్లుగా నమోదైంది. సమీక్షించిన నెలలో భారత తయారీ పరిశ్రమ తిరిగి పునరుద్ధరణ సంకేతాలను చూపిస్తుంది. వృద్ధి వేగం నెమ్మదించినప్పటికీ ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఉత్పత్తి బలంగా పెరగడంతో పీఎంఐ సూచీ పెరిగిందని ఎస్అండ్‌పీ గ్లోబల్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా పేర్కొన్నారు.

సాధారణంగా పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎక్కువ నమోదైతే వృద్ధి గానూ, 50 పాయింట్ల కంటే తక్కువగా ఉంటే క్షీణత గా పరిగణిస్తారు. రానున్న నెలల్లో డిమాండ్ మరింత పెరుగుతుందని తయారీదారులు భావిస్తున్నారు. గత నెలలో మొత్తం డిమాండ్, ఔట్‌పుట్ నెమ్మదిగా ఉన్నప్పటికీ వృద్ధి బలంగా ఉందని ఎస్అండ్‌పీ గ్లోబల్ నివేదిక తెలిపింది.



Next Story

Most Viewed