భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐక్యరాజ్యసమితి!

by Disha Web Desk 17 |
భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐక్యరాజ్యసమితి!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాదికి సంబంధించి భారత ఆర్థిక వృద్ధి అంచనాను 6.6 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. బుధవారం విడుదల చేసిన ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ అప్‌డేట్-2023 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, మాంద్యం ఆందోళనల మధ్య అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. తద్వారా వృద్ధి నెమ్మదించవచ్చు. భారత్‌లో విదేశీ పెట్టుబడులు తగ్గడం, బలహీనపడుతున్న కరెన్సీ విలువ, ద్రవ్యోల్బణ పరిణామాల మధ్య వృద్ధి పరిమితం అవుతుందని ఐక్యరాజ్యసమితి(యూఎస్) అభిప్రాయపడింది.

భారత ప్రభుత్వం వృద్ధిని కొనసాగించేందుకు భారీ మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు పెట్టడం, ఇతర చర్యల ద్వారా వృద్ధిని కొనసాగిస్తోందని తెలిపింది. ఇక, భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాదిలో ప్రపంచ వృద్ధి 2.1 శాతానికి పడిపోతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2022, సెప్టెంబర్‌లో అంచనా వేసిన 2.2 శాతంతో పోలిస్తే ఇది స్వల్పంగా తగ్గింది. అధిక వడ్డీ రేట్లు, బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం వంటి పరిణామాలు సవాలుగా మారాయని యూఎన్ఓ పేర్కొంది.


Next Story

Most Viewed