గుడ్‌న్యూస్: FDలపై వడ్డీ రేట్లను పెంచిన ప్రభుత్వ రంగ బ్యాంక్!

by Disha Web Desk 17 |
గుడ్‌న్యూస్: FDలపై వడ్డీ రేట్లను పెంచిన ప్రభుత్వ రంగ బ్యాంక్!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని, అవి ఏప్రిల్ 10 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ నెల మొదటివారంలో ఆర్‌బీఐ తన ద్వైమాసిక ద్రవ్య విధాన సమావేశంలో కీలక రెపో రేటును యథాతథంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పులు చేసినట్లు బ్యాంకు తెలిపింది.

Also Read: దాదాపు రూ. 38 వేల కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు!


బ్యాంకు అధికారిక వివరాల ప్రకారం, సాధారణ ఖాతాదారులకు 7-29 రోజుల కాలవ్యవధికి సంబంధించి డిపాజిట్లపై 4 శాతం, 30-90 రోజుల డిపాజిట్లపై 4.25 శాతం, 91-179 రోజులకు 4.5 శాతం, 180-269 రోజులకు 4.95 శాతం, 270 రోజుల నుంచి ఏడాది కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై 5.35 శాతం, 1-2 ఏళ్లకు 6.5 శాతం వడ్డీ ఇవ్వనుంది.

ఇక, ప్రత్యేక ఎఫ్‌డీ పథకంలో భాగంగా 444 రోజుల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై అధికంగా 7.25 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు బ్యాంక్ స్పష్టం చేసింది. 2-3 ఏళ్లకు 6.8 శాతం, 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ ఇవ్వనుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం అదనపు వడ్డీ లభించనుంది.



Next Story

Most Viewed