ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి 6.5 శాతం!

by Disha Web Desk 13 |
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి 6.5 శాతం!
X

న్యూఢిల్లీ: అధిక ముడి చమురు ధరలు, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతానికి పెరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి అన్నారు. ఇటీవల ఎదురైన అమెరికా, యూరోపియన్ బ్యాంకింగ్ సంక్షోభం భారత ఆర్థిక రంగంపై ఎలాంటి ప్రభావం చూపడంలేదని ఆయన తెలిపారు. ఇటీవల ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకులు సైతం నెమ్మదించిన వినియోగం, దేశం వెలుపల నుంచి ఎదురయ్యే సవాళ్ల మధ్య దేశ ఆర్థిక వృద్ధిని 6.3-6.4 శాతంగా అంచనా వేశాయి.

ఇదే సందర్భంలో, ప్రస్తుత పరిణామాల మధ్య ప్రపంచ ఆర్థికవ్యవస్థకు కీలక మద్దతు ఇచ్చిన చైనా స్థాయిలో భారత్ ప్రభావం చూపగలదా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన, చైనా అనుసరించిన అన్యాయమైన వాణిజ్య విధానాలను ఇప్పుడు మరే ఇతర దేశమూ ప్రయత్నించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ అలాంటి విధానాల ద్వారా ఎదగాలని అనుకోవట్లేదని, న్యాయమైన వాణిజ్య విధానాల ద్వారానే భారత్ 6.5-7 శాతం వృద్ధిని సాధించవచ్చని అరవింద్ విర్మాణి పేర్కొన్నారు.

Next Story

Most Viewed