భారత వృద్ధి అంచనాల్లో కోత విధించిన IMF!

by Disha Web Desk 10 |
భారత వృద్ధి అంచనాల్లో కోత విధించిన IMF!
X

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి అంచనాల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) కోత విధించింది. ఈ మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.8 శాతంగా ఉంటుందని, ఆ తర్వాత ఇది 6.1 శాతానికి నెమ్మదించవచ్చని మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి భారత వృద్ధి అంచనాలు తమ అక్టోబర్ ఔట్‌లుక్ నుంచి మారలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి వరకు వృద్ధి 6.8 శాతంగా ఉండి, ఆ తర్వాత నెమ్మదించనుంది. దీనికి ప్రధానంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులతో పాటు ఇతర దేశం వెలుపలి అంశాలే కారణంగా ఉండనున్నాయని ఐఎంఎఫ్ పరిశోధనా విభాగానికి చెందిన చీఫ్ ఎకనమిస్ట్ పియర్ ఒలివియర్ అన్నారు. ఇదే సమయంలో భారత ద్రవ్యోల్బణం 6.8 శాతం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గుతుందని IMF అంచనా వేసింది. ఆ తర్వాత RBI నిర్ణయాల ఆధారంగా 2024లో 4 శాతానికి దిగిరావొచ్చని అభిప్రాయపడింది. ఇక, ప్రపంచ వృద్ధి గతేడాదిలో ఉన్న 3.4 శాతం నుంచి 2023లో 2.9 శాతానికి పడిపోతుందని IMF తెలిపింది. ఆపై 2024లో 3.1 శాతానికి పెరుగుతుందని పేర్కొంది.


Next Story

Most Viewed