నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వెళ్లనున్న 'ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్'

by Disha Web Desk 17 |
నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వెళ్లనున్న ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్
X

ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలోని బీమా కంపెనీ 'ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్' నిధుల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు వెళ్ళనుంది. దీనికి సంబంధించిన పేపర్స్‌ను మార్కెట్స్ రెగ్యులేటర్ సెబికి అందజేసింది. ఈ ఐపీఓ విలువ రూ. 2,000 కోట్ల నుంచి రూ. 2,500 కోట్ల మధ్య ఉండనుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా, బీమా కంపెనీ కంపెనీలో 65 శాతం వాటాను కలిగి ఉంది. తర్వాత వార్‌బర్గ్ పింకస్ అనుబంధ కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా 26 శాతం వాటాను, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9 శాతం వాటాను కలిగి ఉంది.

ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో బ్యాంక్ ఆఫ్ బరోడా 89,015,734 షేర్లను, కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా 39,227,273 షేర్లను, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13,056,415 షేర్లను ఉపసంహరించుకుంటాయి. నిధుల సమీకరణ ద్వారా తమ మూలధనాన్ని పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.

బీమా కంపెనీ ఆర్జించిన నికర ప్రీమియంలు క్రితం ఏడాదితో పోలిస్తే 2022కు 27.80 శాతం పెరిగి రూ. 4,985.21 కోట్లకు చేరాయి. కంపెనీ ఈ సంవత్సరం జూన్ నాటికి 1,634 వ్యక్తిగత ఏజెంట్లు, 21 కార్పొరేట్ ఏజెంట్లను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి :

31 శాతం వృద్ధిని నమోదు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్

Next Story

Most Viewed