మూడేళ్లలో రెట్టింపు కానున్న భారత డేటా సెంటర్ సామర్థ్యం

by Disha Web Desk 17 |
మూడేళ్లలో రెట్టింపు కానున్న భారత డేటా సెంటర్ సామర్థ్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో డేటా సెంటర్ సామర్థ్యం మూడేళ్లలో రెట్టింపు అవుతుందని ఒక నివేదిక పేర్కొంది. ఇది 2023లో 0.9 GW (గిగావాట్) నుండి 2026లో దాదాపు 2 GWకి పెరుగుతుందని CareEdge రేటింగ్స్ అంచనా వేసింది. రాబోయే మూడేళ్లలో రూ. 50,000 కోట్ల కాపెక్స్ అవసరం అయ్యే అవకాశం ఉంది. అదనపు సామర్థ్యం పెంపొందించడం వల్ల గణనీయమైన పెట్టుబడి అవకాశాలు ఏర్పడతాయని క్రెడిట్ రేటింగ్ తెలిపింది. నివేదిక పేర్కొన్న దాని ప్రకారం, ప్రస్తుతం భారత్‌లో డేటా సెంటర్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంది. ప్రపంచదేశాల్లో 20 శాతం ఉత్పత్తి అవుతున్న డేటాలో భారత్ కేవలం 3 శాతం వాటాను కలిగి ఉంది. అదే నెల ప్రాతిపదికన ఎక్సాబైట్ల వినియోగంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో డేటా వినియోగం అత్యధికంగా ఉందని నివేదిక పేర్కొంది.

డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒక్కో మెగావాట్‌కు ఖర్చు కూడా పెరుగుతోంది, ఒక్కో మెగావాట్‌కు సగటున రూ. 40-45 కోట్ల నుంచి రూ.60-70 కోట్ల స్థాయికి పెరుగుతోందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ పూజా జలన్ చెప్పారు. ఈ పరిశ్రమ రాబోయే 5-6 ఏళ్లలో 5 GW సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌లను ఏర్పాటు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ డైరెక్టర్ మౌలేష్ దేశాయ్ అన్నారు.


Next Story

Most Viewed