వరుసగా రెండో ఏడాది చైనా కంటే ఎక్కువ యూనికార్న్‌లు భారత్‌లోనే!

by Disha Web Desk 17 |
వరుసగా రెండో ఏడాది చైనా కంటే ఎక్కువ యూనికార్న్‌లు భారత్‌లోనే!
X

ముంబై: గతేడాది భారత్ కొత్తగా 23 యూనికార్న్ కంపెనీలను సృష్టించడంలో చైనాను అధిగమించింది. అదే సమయంలో చైనాలో కొత్తగా 11 యూనికార్న్ స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయని ఓ నివేదిక తెలిపింది. చైనా కంటే ఎక్కువ సంఖ్యలో యూనికార్న్ కంపెనీలను సాధించడం భారత్‌కు ఇది వరుసగా రెండవసారి. మనదేశంలో కొత్తగా ఏర్పడిన కంపెనీలతో కలుపుకుని ప్రస్తుతం 96 యూనికార్న్‌లు ఉన్నాయని ఐవీసీఏ-బైన్ అండ్ కంపెనీ వెల్లడించింది.

అయితే, 2021లో కొత్తగా వృద్ధి చెందిన 44 యూనికార్న్‌లతో పోలిస్తే ఈసారి సగం స్టార్టప్ కంపెనీలే ఈ ఘనతను సాధించాయి. 2022లో దేశీయంగా ఎదిగిన యూనికార్న్‌లలో తొమ్మిది కంపెనీలు ప్రధాన 4 మెట్రో నగరాలకు చెందినవి. దీన్ని బట్టి నాన్-మెట్రో నగరాల్లోని స్టార్టప్‌లకు మెరుగైన నిధుల లభ్యత ఉందని తెలుస్తున్నదని నివేదిక అభిప్రాయపడింది.

సమీక్షించిన ఏడాదిలో అత్యధికంగా సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ ఆధారిత కంపెనీలు, ఫిన్‌టెక్ కంపెనీలు ఎక్కువ నిధులను రాబట్టగా, కన్స్యూమర్ టెక్ పరిశ్రమలు వచ్చే నిధులు క్షీణించాయి. 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువను సాధించిన స్టార్టప్ కంపెనీలను యూనికార్న్‌లుగా పరిగణిస్తారు.


Next Story