షాకిచ్చిన డిసెంబర్ ఫస్ట్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

by Disha Web |
షాకిచ్చిన డిసెంబర్ ఫస్ట్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి చేసుకునే వారికి బంగారం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పెళ్లీల సీజన్ నడుస్తుంది. దీంతో చాలా మంది బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 880 పెరిగి, రూ. 53, 850 గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగి, రూ. 48, 550 నమోదైంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 67, 500 గా ఉంది.


Next Story