5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు ఎలా..? ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు..

by Dishafeatures2 |
5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు ఎలా..? ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో ఆధార్ కార్డు అనేది ప్రతిఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. ఏ ఆధారానికైనా ఆధార్ కార్డును బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కోరుతాయి. ప్రభుత్వ స్కీమ్స్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నా.. బ్యాంకు అకౌంట్ కావాలన్నా.. సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. ఇలా ప్రతీ పనికి ఆధార్ కార్డునే అడుగుతారు. దీంతో ప్రతీ పౌరుడుకి ఉండాల్సిన గుర్తింపు కార్డుగా ఆధార్ మారిపోయింది. అంతేకాకుండా దేశంలోని ప్రతీ పౌరుడికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ దీని వల్ల ఉంటుంది. దీని వల్ల వ్యక్తిని గుర్తించడం కూడా సులువు అవుతుంది.

అయితే పెద్దలకే కాదు.. చిన్నారులకు కూడా ఆధార్ కార్డు అవసరం. పిల్లలకు కూడా అనేక విషయాల్లో ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు జారీ చేస్తారు. చిన్నపిల్లలకు ఆధార్ ఎలా పొందాలనేది ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఆధార్ సెంటర్‌కు తల్లిదండ్రులు వెళ్లి తమ పిల్లలకు ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు పూర్తి చేయాలి. దరఖాస్తులో తల్లిదండ్రుల వివరాలను పొందుపర్చాలి. ఐదేళ్లలోపు చిన్నారుల కోసం తీసుకుంటున్నట్లు అయితే తల్లిదండ్రుల వివరాలు ఇస్తే సరిపోతుంది. చిన్నారుల ఫొటోను అధికారులు తీసుకుని తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు ఆధారంగా పిల్లల వివరాలను నమోదు చేసుకుంటారు. అయితే చిన్నారులకు ఆధార్ కార్డు కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా బిడ్డ పుట్టాక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఇచ్చే సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ అందించిన తర్వాత అధికారులు పరిశీలించి కొద్దిరోజుల్లో పిల్లలకు ఆధార్ కార్డు జారీ చేస్తారు. ఐదేళ్లోలోపు చిన్నారుల బయోమెట్రిక్ అయితే తీసుకోరు. 15 ఏళ్లు వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తే సరిపోతుంది.

Read More : క్రెడిట్ కార్డు బిల్లు ఎక్కువగా చెల్లిస్తున్నారా..? ఇక ఆ ఛాన్స్ లేదు



Next Story

Most Viewed