జనవరి-మార్చిలో 22 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!

by Disha Web Desk 17 |
జనవరి-మార్చిలో 22 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!
X

ముంబై: సానుకూల డిమాండ్ కారణంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల అమ్మకాలు 22 శాతం పెరిగాయని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్‌ నివేదిక తెలిపింది. కొత్త నిర్మాణాలు కూడా గత ఏడాది కంటే 86 శాతం పుంజుకున్నాయి. నివేదిక ప్రకారం, సమీక్షించిన కాలంలో దేశంలో ప్రధాన ఎనిమిది నగరాల్లో హౌసింగ్ విక్రయాలు 85,850 యూనిట్లకు పెరిగాయి. కొత్త నిర్మాణాల లాంచ్‌లు 86 శాతం వృద్ధితో 1,47,780 యూనిట్లకు చేరుకున్నాయి. ఒక త్రైమాసికంలో నమోదైన అత్యధిక కావడం గమనార్హం.

గడిచిన ఏడాది కాలంలో వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఇళ్ల అమ్మకాలు పెరిగాయని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, దేశీయంగా ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి పరిణామాల మధ్య అమ్మకాలతో పాటు కొత్త నిర్మాణాలు అందుబాటులో ఉండటం పరిశ్రమకు సానుకూల అంశమని ప్రాప్‌టైగర్ సీఎఫ్ఓ వికాస్ వాధవన్ చెప్పారు.

హైదరాబాద్‌లో అత్యధికంగా 55 శాతం వృద్ధితో 10,200 ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇతర ప్రధాన నగరాల్లో విక్రయాలను గమనిస్తే.. ముంబైలో ఇళ్ల అమ్మకాలు 38 శాతం పెరిగి 32,380 యూనిట్లకు పెరిగాయి. పూణెలో 16,320 యూనిట్ల నుంచి 16 శాతం పెరిగి 18,920 యూనిట్లకు, అహ్మదాబాద్‌లో 31 శాతం వృద్ధితో 7,250 యూనిట్లకు, చెన్నైలో 10 శాతం పెరిగి 3,630 యూనిట్లు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 24 శాతం తగ్గి 3,800 యూనిట్లు, బెంగళూరులో 7,680 యూనిట్లతో 3 శాతం క్షీణించాయని నివేదిక పేర్కొంది.



Next Story

Most Viewed