జూనియర్ ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే ఇచ్చే యోచనలో టీసీఎస్!

by Disha Web Desk 13 |
జూనియర్ ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే ఇచ్చే యోచనలో టీసీఎస్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తన ఉద్యోగుల్లో ఉన్న వేతన వ్యత్యాసాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టనుంది. ఉద్యోగ ఆఫర్ లభించిన అందరికీ ఉద్యోగాలు ఇస్తామని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్(సీహెచ్ఆర్ఓ) మిలింద్ లక్కడ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. టెక్ రంగంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాల్సిన క్లిష్టపరిస్థితిలో ఉన్నప్పటికీ, తాము ఫ్రెషర్లను నియమించుకోవడం, ఉద్యోగుల వేతనాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉన్నట్టు ఆయన వెల్లడించారు. అందుకోసం ఉద్యోగులు స్కిల్స్ పెంచుకుని జీతాలను రెట్టింపు చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్టు మిలింద్ తెలిపారు.

కంపెనీలోనే వివిధ స్థాయిలలో ఉన్నవారికి శిక్షణ ద్వారా వీలైనంత ఎక్కువమందికి అవకాశమివ్వాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ వివరించింది. ఆయా ఉద్యోగులు ట్రైనింగ్‌లో చూపే ప్రతిభ ఆధారంగా అసెస్‌మెంట్‌లను క్లియర్ చేసిన ఉద్యోగుల జీతాలను రెట్టింపు చేస్తాం. అయితే, ఈ అసెస్‌మెంట్‌లో ప్రతి ఏడాదికి కేవలం 10 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్రెషర్లకు వేతనాలను పెంచడమే కాకుండా జూనియర్ స్థాయి ఉద్యోగులకు 100 శాతం త్రైమాసిక వేరియబుల్ పే ఇచ్చే అంశంపై పరిశీలిస్తున్నట్టు మిలింద్ చెప్పారు. పెరుగుదల ఎప్పటి నుంచి అనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.


Next Story