అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు గడువు పెంచిన ప్రభుత్వం!

by Disha Web Desk 17 |
అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు గడువు పెంచిన ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) అధిక పింఛను కోసం వివరాల అప్‌లోడ్ చేసేందుకు సంస్థలకు గడువు పొడిగించింది. ఉద్యోగుల వేతన వివరాలను అప్‌లోడ్ చేయడానికి సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ కాగా, దీన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ పేర్కొంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 5.52 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని కార్మిక శాఖ తెలిపింది. అధిక పింఛను వ్యవహారంలో గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఉద్యోగులకు అధిక పింఛను కోసం అవకాశం ఇచ్చారు. దానికోసం ఆన్‌లైన్‌లో ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి దరఖాసులను ఆహ్వానించారు. దీనికి మొదట మే 3 వరకు గడువు ఉండగా పలు దఫాలుగా పొడిగింపు అవకాశం ఇచ్చారు. తాజాగా మరోసారి పెంచారు.

ఇవి కూడా చదవండి : 5-Year Recurring Deposit : ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన కేంద్రం!


Next Story