లక్షద్వీప్‌లో మొదటి బ్రాంచ్‌ను ప్రారంభించిన HDFC బ్యాంక్

by Disha Web Desk 17 |
లక్షద్వీప్‌లో మొదటి బ్రాంచ్‌ను ప్రారంభించిన HDFC బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ HDFC బ్యాంక్ లక్షద్వీప్‌లోని కవరత్తి ద్వీపంలో కొత్తగా శాఖను ప్రారంభించింది. దీంతో కేంద్ర పాలిత ప్రాంతంలో ఏర్పాటైన తొలి ప్రైవేట్ రంగ బ్యాంకుగా ఇది నిలిచింది. లక్షద్వీప్‌లోని ప్రజలు, వ్యాపారులు, టూరిస్ట్‌ల అవసరాలను తీర్చడానికి ఎదురుచూస్తున్నామని బ్యాంక్ రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ ఎస్ సంపత్‌కుమార్ తెలిపారు. ఇటీవల భారత్-మాల్దీవుల మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో లక్షద్వీప్‌ను టూరిస్ట్ హబ్‌గా మార్చడానికి కేంద్రం నిర్ణయించిన తరుణంలో అక్కడ బ్యాంకింగ్ సేవలు అందించడానికి మిగతా ప్రైవేట్ బ్యాంకుల కంటే ముందుగా HDFC తన బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం లక్షద్వీప్‌లో టూరిస్ట్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈ కొత్త శాఖ ద్వారా ప్రజలకు పర్సనల్ బ్యాంకింగ్, రిటైలర్‌లకు QR ఆధారిత లావాదేవీలు, డిజిటల్ బ్యాంకింగ్‌పై దృష్టి సారించి విస్తృత శ్రేణి సేవలను అందించడం ద్వారా కేంద్రపాలిత ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. HDFC బ్యాంక్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి టూరిస్ట్ ప్రదేశాల్లో శాఖలను కలిగి ఉండగా, ఇప్పుడు లక్షద్వీప్ ద్వీప్‌లో కూడా కొత్త శాఖను ప్రారంభించింది. ఇది డిసెంబర్ 31, 2023 నాటికి దేశవ్యాప్తంగా 8,091 బ్రాంచ్‌లను కలిగి ఉంది.

Next Story

Most Viewed