ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

by Dishanational1 |
ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ) రేట్లను 25 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకు సవరించింది. కొత్త రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు పేర్కొంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 3.5 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉంది. అత్యధికంగా వడ్డీని 18 నెలల నుంచి 21 నెలల మధ్య కాలానికి 7 శాతం నుంచి 7.25 శాతానికి పెంచినట్టు బ్యాంకు వెల్లడించింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా 7.75 శాతం గరిష్ఠ వడ్డీని బ్యాంకు అమలు చేస్తోంది. మిగిలిన కాలాలకు సంబంధించి 7-29 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం, 30-45 రోజులకు 3.50 శాతం, 46 రోజుల నుంచి 6 నెలలకు 4.50 శాతం, 6-9 నెలలకు 5.75 శాతం, 9 నెలల ఒక రోజు నుంచి ఏడాదిలోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6 శాతం వడ్డీ అమలవుతుంది. ఏడాది నుంచి 15 నెలలకు 6.60 శాతం, 15-18 నెలలకు 7.10 శాతం, 18-21 నెలలకు 25 బేసిస్ పాయింట్లు అధికంగా 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. 21 నెలల నుంచి రెండేళ్ల 11 నెలలకు 7 శాతం వడ్డీ అమలు చేసింది. అన్ని కాలవ్యవధులపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ అమలవుతుంది.


Next Story