HDFC బ్యాంక్ నుంచి మరో శుభవార్త

by Disha Web Desk 17 |
HDFC బ్యాంక్ నుంచి మరో శుభవార్త
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ నెల ప్రారంభంలోనే ఎఫ్‌డీలపై 75 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్, తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు బుధవారం(అక్టోబర్ 26) నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

ఈ రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీ మొత్తాలకు వర్తిస్తాయి. బ్యాంకు అధికారిక వివరాల ప్రకారం, 7-14 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 3 శాతం, ఏడాది కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 6.10 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే, 6 నెలల ఎఫ్‌డీలపై 4.50 శాతం, ఏడాది నుంచి రెండెళ్ల కాలవ్యవధి మధ్య ఎఫ్‌డీలపై 6.15 శాతం వడ్డీ అందుతుంది.

అత్యధికంగా ఐదేళ్ల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీని బ్యాంకు ఇవ్వనుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ లభిస్తుంది. వీరికి అన్ని కాలవ్యవధులపై వడ్డీ రేటు 3.50-6.75 శాతం మధ్య ఉంటుంది.

అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ)లపై కూడా సాధారణ ఖాతాదారులకు 6 నెలల కాలవ్యవధిపై 4.50 శాతం, 5 ఏళ్ల కాలవ్యవధి ఉన్న ఆర్‌డీలపై 6.25 శాతం వడ్డీ ఇవ్వనుంది. ఆర్‌డీలపై కూడా సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది.



Next Story

Most Viewed