గుడ్‌న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్!

by Disha Web Desk 17 |
గుడ్‌న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలు తీసుకునే వినియోగదారులకు ఊరట కల్పించింది. వడ్డీ రేట్లు పెరుగుతున్న సమయంలో బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ని 85 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది.

బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రుణ రేట్లు ఏప్రిల్ 10 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు తర్వాత బ్యాంకు ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 40 బేసిస్ పాయింట్లు తగ్గి 8.30 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.7 శాతానికి దిగొచ్చింది. అయితే, 1-3 ఏళ్ల కాలానికి చెందిన ఎంసీఎల్ఆర్ స్థిరంగా ఉంటాయని బ్యాంకు పేర్కొంది.


Next Story