జనవరిలో రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

by Dishanational1 |
జనవరిలో రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2024, మొదటి నెల జనవరిలో రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో అత్యధికం కావడం విశేషం. గతేడాది ఏప్రిల్‌లో నమోదైన 1.87 లక్షల కోట్లు ఇప్పటివరకు అత్యధికం. ఆ తర్వాత అక్టోబర్‌లో నమోదైన రూ. 1,72,003 కోట్లు మూడవ అత్యధిక వసూళ్లుగా ఉన్నాయి. అలాగే, జనవరిలో నమోదైన జీఎస్టీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడించాయి. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో మొత్తం రూ. 1,72,129 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. అందులో సీజీఎస్టీ రూ. 43,552 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 37,257 కోట్లు వచ్చాయి.



Next Story

Most Viewed